అమర్‌నాథ్ యాత్రలో సహజసిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు అనేక వ్యయప్రయాసలకు గురవుతారు. ఇక్కడి సహజ గుహలు, ప్రకృతి రమణీయత మధ్య నెలకొన్న ఆధ్యాత్మిక వాతవరణం గురించి మాటల్లో చెప్పలేం. అమర్‌నాథ్ యాత్రలో దీనితోపాటు చూడాల్సిన అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.
Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. శనివారం జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బాల్‌లోని బల్తాల్ బేస్ క్యాంపు నుంచి అమర్‌నాథ్ యాత్రికుల తొలి బ్యాచ్ అమర్‌నాథ్ గుహకు బయలుదేరింది.
సుప్రసిద్ధ అమర్‌నాథ్ యాత్రకు.. జమ్మూకశ్మీర్ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ్టి నుంచి యాత్రికులు.. మంచు శివలింగం దర్శనానికి వెళ్లనున్నారు. ఇవాళ్టి నుంచి ఆగస్టు 31 వరకు అమర్ నాథ్ యాత్ర కొనసాగనుంది.