దేశ రాజధాని ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనపై వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో 8 ఫైరింజన్లు అక్కడికి చేరుకుని.. రెస్క్యూ పనులు ప్రారంభించారు. అయితే.. అదృష్టవశాత్తూ మంటలు చెలరేగిన వెంటనే ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు భవనం నుంచి వెళ్లిపోయారు. దీంతో ప్రాణపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్న క్రమంలో…