పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సోఫా గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. జిల్ పల్లి కి చెందిన మొహమ్మద్ సోయం వాదియ ఉమర్ కాలనీలో గత కొంతకాలంగా సోఫాలు తయారు చేస్తున్నాడు. ఎప్పటిలాగే రాత్రి పనులు ముగించుకుని అనంతరం గోదాంకు తాళం వేసి వెళ్ళాడు. ఉదయం గోదాం యజమాని మహమ్మద్ సోయబ్ కు స్థానికులు ఫోన్ చేసి గోదాంలో మంటలు చెల్లరేగాయని చెప్పారు. వెంటనే యజమాని పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో నాలుగు గంటలు శ్రమించి మంటలను ఆర్పేశారు. అప్పటికే పూర్తిగా తయారైన సోఫాలతో పాటు సోఫాకు సంబంధించిన సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. అగ్ని ప్రమాదంలో 15 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందని సోయాబ్ పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన షాక్ సర్క్యూట్ కారణంగానా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read : Karnataka CM swearing: కర్ణాటక సీఎం ప్రమాణస్వీకారం.. కేసీఆర్, మమతాతో సహా గెస్ట్ లిస్ట్ ఇదే..