కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదంతో వేకువ ఝామున రహదారి నెత్తురోడింది. ఇవాళ (శుక్రవారం) ఉదయం కృత్తివెన్ను మండలం సీతనపల్లి దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వ హస్పటల్ కు తరలించారు.