MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Yarlagadda Venkata Rao: కృష్ణా జిల్లాలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారం మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గన్నవరం విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరుకాకపోవడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు చిన్ని, బాలశౌరి తదితరులు పాల్గొన్నప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ గైర్హాజరుకావడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.
యార్లగడ్డ వెంకట్రావు ఇటీవల గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనుల కాంట్రాక్టులపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్టు పనులను మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సన్నిహితంగా ఉన్నట్లు పేర్కొన్న కేఎంవీ (KMV) సంస్థకు అప్పగించారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆ సంస్థ వంశీకి ఆర్థిక సహాయం చేసిందని కూడా విమర్శించారు. అంతేకాకుండా, మొత్తం పనుల్లో సుమారు 80 శాతం పనులకు రూ.300 కోట్లకు పైగా కేటాయిస్తే, కేవలం 20 శాతం పనులకు రూ.206 కోట్లు కేటాయించడం ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని యార్లగడ్డ డిమాండ్ చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని కూడా కోరారు.
Also Read
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
మరోవైపు, యార్లగడ్డ ఆరోపణలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తనకు కేఎంవీ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ కూడా రాసిన విషయం విదితమే.. వాస్తవాలు బయటకు రావాలని కోరుతూ యార్లగడ్డ చేసిన ఆరోపణలను ఖండించారు. అయితే, ఈ పరిణామాల నేపథ్యంలోనే గన్నవరం ఎయిర్‌పోర్టులో జరిగిన ఏటీసీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యార్లగడ్డ హాజరుకాకపోవడం మరింత చర్చకు దారితీసింది. ఆయన గైర్హాజరు వెనుక కాంట్రాక్టుల వివాదమే కారణమా? లేక ఇతర రాజకీయ కారణాలు ఉన్నాయా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. అధికారికంగా యార్లగడ్డ గైర్హాజరుకు కారణాలు వెల్లడికాకపోయినా, ఇటీవల చేసిన ఆరోపణలతో ఈ ఘటనకు సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో గన్నవరం రాజకీయాల్లో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయింది..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!