యాంకర్, సినీ నటి అనసూయ కు పబ్లిక్ లో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. ఎక్కడైనా కనిపిస్తే చాలు కుర్రాళ్లు ఎగబడుతున్నారు.. ప్రస్తుతం ఆమె కేరీర్ పీక్స్ లో ఉందని వేరేలా చెప్పనక్కర్లేదు.. వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లకు కూడా అనసూయ ఎక్కువగా వెళ్తుంది.. తాజాగా అనసూయ కోదాడ వెళ్లినట్లు సమాచారం. అక్కడ ఓ షాప్ ఓపెనింగ్ లో ఆమె పాల్గొన్నారు. అనసూయ రాకను తెలుసుకున్న ఫ్యాన్స్ భారీగా అక్కడకు చేరుకున్నారు..
అనసూయ దిగనివ్వకుండా కారును చుట్టుముట్టారు. సెక్యూరిటీ మధ్య ఆమెను వేదికపైకి తీసుకెళ్లారు.. అక్కడ మాట్లాడుతుంటే..అస్సలు మాట్లాడనివ్వకుండా ఈలలు వేస్తూ గోల చేశారు.. ఆ ప్రాంతం అంత వారి సందడి వాతావరణం నెలకొంది… ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
ప్రస్తుతం ఈ అమ్మడు విమానం సినిమాలో వేశ్య పాత్ర చేశారు. స్లమ్ ఏరియాలో వ్యభిచారం చేస్తూ జీవనం సాగించే ఒంటరి స్త్రీగా ఆమె పాత్ర ఉంది.. ఇవే కాదు పుష్ప 2 లో దాక్షాయణిగా నటిస్తుంది. ఇది నెగిటివ్ రోల్. డీ గ్లామర్ లుక్ లో అనసూయ షాక్ ఇచ్చారు. పార్ట్ 2లో సునీల్, అనసూయ పాత్రలను దర్శకుడు సుకుమార్ ఎలా ముగించారో చూడాలి. క్రిస్మస్ కానుకగా పుష్ప 2 విడుదల కానుందనే ప్రచారం జరుగుతుంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు.. ఇక సోషల్ మీడియాలో కూడా అనసూయ యాక్టివ్ గా ఉంటుంది… ఈ మధ్య విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు అనసూయకు వార్ కూడా జరిగింది..