తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల పెళ్లి ఆ కుటుంబాలకు భారం కావొద్దని అద్భుతమైన సంక్షేమపథకం కళ్యాణలక్ష్మిని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన వధువుకు రూ.1,00,116 ఒకేసారి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. కాగా కొంతమంది వ్యక్తులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. కళ్యాణలక్ష్మి పథకం కోసం నకిలీ పత్రాలు తయారు చేసి మోసానికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు.
Also Read:The Raja Saab: అర్ధరాత్రి జీవో.. తెలంగాణలో భారీగా పెరిగిన రాజా సాబ్ టికెట్ రేట్లు
పోలీసులు ఎంట్రీతో వీరి బాగోతం బయటపడింది. నలుగురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.మైనర్ బాలికకు వివాహం జరిగితే మేజర్ అని డేట్ మార్చి మీ సేవ నిర్వాహకుడు సరిఫికెట్లు తయారు చేశాడు. ఈ వ్యవహారంపై గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా మీసేవ ఆపరేటర్ ములాజ్కర్ శరద్ @ శరత్ , జాధవ్ గణేష్ లను అరెస్టు చేశారు. ఇంగ్లే అంకుష్, కడమ్ శ్యాంసుందర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.