చిన్నాచితక మహిళా వ్యాపారులే అతని టార్గెట్ !! ముద్ర లోన్స్ పేరుతో పరిచయం చేసుకుని.. మాయమాటలు చెప్పి.. నిండా ముంచుతున్నాడు. ఇలా మోసం చేసింది ఏ 10 మందినో.. వంద మందినో కాదు. ఏకంగా 500 మందిని మోసం చేశాడు. లక్షలు దండుకుని ఆస్తులు కూడగట్టుకుని తప్పించుకు తిరుగుతున్నాడు. ఐదేళ్ల తర్వాత కానీ పోలీసులకు పట్టుబడలేదు. రోజుకో ప్రాంతంలో మారు వేషాల్లో తిరుగుతున్న ఈ ఘరానా మోసగాడిని ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. అమాయకంగా చేతులు కట్టుకుని నిల్చున్న…
వల్లభనేని వంశీ రెండు రోజుల కస్టడీ పూర్తి అయింది.. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నమోదైన కేసుకి సంబంధించి వంశీని రెండ్రోజుల పాటు పోలీసులు విచారించారు. వంశీని 30కిపైగా ప్రశ్నలు అడిగారు. నకిలీ ఇళ్ల పట్టాలను ఎక్కడ ఎవరు ఎందుకు తయారు చేసారని వంశీని పోలీసులు ప్రశ్నించారు. నకిలీ ఇళ్ల పట్టాల తయారీలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయాల్ని అడిగారు. తనకు నకిలీ పట్టాలతో సంబంధం లేదని వంశీ సమాధానం చెప్పారు.
Bangladeshi Nationals Arrested: కర్ణాటకలోని చిత్రదుర్గలోని హోల్‌కెరె రోడ్డులో నవంబర్ 18న పెట్రోలింగ్ చేస్తున్న ఆరుగురు బంగ్లాదేశ్ పౌరులను పోలీసులు ఆరెస్ట్ చేసారు. ఈ వ్యక్తులు చాలా ఏళ్ల క్రితం కోల్‌కతా నుంచి అక్రమంగా చొరబడి భారత సరిహద్దులలోకి వచ్చారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో షేక్ సాయిపూర్ రోహ్మాన్, మహ్మద్ సుమన్ హుస్సేన్ అలీ, మజరుల్, అజీజుల్ షేక్, మహ్మద్ సాకిబ్ సిక్దార్, సన్వర్ హుస్సేన్ లు ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై మరింత…
Land Grab : రాయదుర్గం లో భారీ భూ దందా వెలుగులోకి వచ్చింది. 1500 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని అసిస్టెంట్ సబ్ రిజిస్ట్రార్ కొట్టేసిన ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ గ్రీక్ బిల్డర్స్ తో కలిసి.. ప్రభుత్వ ఆస్తిని కాజేశాడు సదరు అధికారి.. ప్రైవేట్ వ్యక్తులకు సహకరించి సబ్ రిజిస్ట్రార్ నకిలీ పత్రాలు సృష్టించారు. కాజేసిన స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్, హై రైజ్డ్ బిల్డింగ్ నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది గ్రీక్ బిల్డర్స్. రెవెన్యూ అధికారుల చొరవతో…
Fake Documents: ఏలూరు జిల్లాలోని నూజివీడులో నకిలీ డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్ చేసేందుకు ముఠా ప్రయత్నం చేసింది. ఈ విషయం మంత్రి పార్థసారధి దృష్టికి వెళ్ళటంతో విచారణకు ఆదేశాలు జారీ చేశారు. 66- 2 సర్వే నెంబర్ గల భూమికి 25. 46 ఎకరాలను నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ కు ముఠా తెగబడింది.
ఓ కంపెనీకి సంబంధించి నకిలీ భూ పత్రాల సృష్టించి మోసానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేఖర్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని మూసాపేటలో గల ఓ కంపెనీకి చెందిన స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించాడు. 1500 గజాల స్థలానికి ఫేక్ పత్రాలు సృష్టించి ఆ స్థలానికి అమ్ముతానంటూ.. ఓ వ్యక్తి దగ్గరి నుంచి రూ.1.10 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నాడు. నకిలీ పత్రాలుగా గుర్తించిన బాధితుడు.. మోస పోయినట్లు గ్రహించి…