హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటిని అందించడంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హుజురాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో కాకతీయ కాలువ ద్వారా నీరు కొనసాగుతున్నప్పటికీ, డీబీఎం 16 ద్వారా హుజురాబాద్ రైతులకు నీరును అందించకుండా నిర్లక్ష్యం చూపుతున్నారని, ఇది అసహనానికి గురిచేస్తోందన్నారు. ఖమ్మం కోసం నీటిని…
దేశంలో బాలికల చట్టబద్ద పెళ్లి వయసు 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. అయితే తెలంగాణలో మాత్రం 20 ఏళ్లకే అమ్మాయిలు పెళ్లి చేసేసుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 2014 నుంచి 20ఏళ్ల వయసు లోపు పెళ్లైన యువతుల సంఖ్య 4.18 లక్షలుగా ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కోసం కొంత మంది తల్లిదండ్రులు ఆధార్ కార్డుల్లో తమ పిల్లల వయసు పెంచి చూపిస్తున్నారు. కళ్యాణ లక్ష్మీ…
తెలంగాణలో పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు ఆసరాగా ఉండాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ పథకంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 45 ఏళ్ల కిందట వివాహమైన ముగ్గురు వృద్ధులకు కళ్యాణలక్ష్మీ పథకం డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. సిరికొండ మండలానికి చెందిన 67 ఏళ్ల శకుంతలబాయి అనే మహిళకు రెండుసార్లు, 65 ఏళ్ల సుమన్‌బాయి అనే మహిళకు మూడుసార్లు వారి బ్యాంకు ఖాతాలో కళ్యాణలక్ష్మీ ఆర్థిక సాయం…