కమ్మ సామాజిక వర్గంపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూ చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఇంతకుముందు కమ్మ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేయగా.. ఈ నేపథ్యంలో కమ్మ కులస్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆమంచి కృష్ణమోహన్ కమ్మ కులానికి క్షమాపణ చెప్పారు.
Varun Tej: నిహారిక విడాకులు.. వరుణ్ పెళ్లి వాయిదా.. ?
ఈ సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ.. వేటపాలెం ఘటనలో తాను చేసిన వ్యాఖ్యలు కమ్మ సామాజిక వర్గంలోని కొందరు కుల రహితంగా బ్రతికే వారికి, తన శ్రేయోభిలాషులకు, స్నేహితులకు బాధించాయని.. ఈ నేపథ్యంలో అందరికీ మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని ఆయన అన్నారు. తాను చేసిన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని తెలిపారు. ఆరోజు ఆ ఘటనకు కారణమైన వ్యక్తులకు మాత్రం తన క్షమాపణలు వర్తించవని ఆయన పేర్కొన్నారు.