Chandramukhi 2 Shocked Dil Raju: తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా పండుగ వస్తుందంటే.. సినిమాల హడావుడి పీక్స్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పటికే దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతికి ఇప్పటికే కర్చీఫులు వేసేసుకున్నారు. షూటింగ్ దశలో ఉన్న సినిమాలు పోటీ ఇచ్చేందుకు సై అంటున్నా వినాయక చవితి పరిస్థితి మాత్రం వింతగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే సలార్ వాయిదా టాలీవుడ్ లో విచిత్ర పరిణామాలకు దారి తీసింది. కీలకమైన వినాయక చవితికి డబ్బింగ్ సినిమాలే నైవేద్యం పెట్టేలా చేసిందని అంటున్నారు. సలార్ వెనక్కి వెళ్లకపోయి ఉంటే ఉంటే స్కంద సెప్టెంబర్ 15 వచ్చేసేది. వీకెండ్ తో పాటు ఫెస్టివల్ అడ్వాంటేజ్ తీసుకునేది. సలార్ వదిలేసిన తేదీపై ఇప్పటికే ‘రూల్స్ రంజన్’, ‘మ్యాడ్’, ‘పెద కాపు-1’ లాంటి చిన్న సినిమాలు కర్చీఫ్ లు వేసుకున్నాయి. దీంతో వినాయక చవితికి ఓ కొత్త సినిమాకి వెళ్ళాలి అనుకున్న వారికీ చంద్రముఖి 2 , ‘మార్క్ ఆంథోనీ’, రామన్న యూత్ అనే ఒక చిన్న సినిమా మాత్రమే ఆప్షన్లుగా కనిపిస్తున్నాయి.
Tollywood Divorce: షాకింగ్.. నిహారిక తరువాత మరో జంట విడాకులు..?
నిజానికి లారెన్స్ చంద్రముఖి 2 మీద ఆల్రెడీ బజ్ ఉంది. రెండు దశాబ్దాల క్రితం రజనీకాంత్ చేసిన కథనే మళ్ళీ రీమేక్ చేశారు అనే విధంగా ట్రైలర్ కట్ చేయడంతో ఖచ్చితంగా ఓపెనింగ్స్ అయితే తెస్తాయని అంటున్నారు. ఇక విశాల్ హీరోగా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన మార్క్ ఆంటోనీ సైతం గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఇప్పుడు చంద్రముఖి 2 సినిమా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి చంద్రముఖి-2, స్కంద రైట్స్ కొనుక్కున్న దిల్ రాజు థియేటర్ల సర్దుబాటు చేయలేక స్కంద సినిమాను వెనెక్కు వెళ్లేలా చేశారు. ఇప్పుడు చంద్రముఖి-2 అదే డేటుకు వెళ్లడంతో స్కంద ముందుకు రావచ్చని అంచనాలున్నాయి. నిజానికి ఈ వీక్ రిలీజైన షారుక్ జవాన్, అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి జోరు గట్టిగానే ఉన్నా 15వ తేదీకి చల్లారిపోతుందని చెప్పక తప్పదు. అలాంటప్పుడు తెలుగు స్ట్రెయిట్ మూవీ అయితే పెద్ద అడ్వాంటేజ్ దక్కేది కానీ అది కుదరడం లేదని భావించారు. అయితే స్కంద ముందుకు వచ్చే అవకాశం ఉండడంతో కొంత వరకు పండుగకి సినిమా రావచ్చని అంటున్నారు.