Etela Rajender: ప్రజల సమస్యల కోసం ఎక్కడికైనా పోతా.. ఏమైనా చేస్తా..!
- సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మార్నింగ్ వాక్..
- ప్రతి చెరువు ఊరికి కన్నతల్లిలాగా పని చేసేది..
- ప్రస్తుతం ఒక రాంగ్ ప్రాక్టీస్ రాజ్యమేలుతుంది: ఈటల రాజేందర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్కాజ్‌గిరి అసెంబ్లీ పరిధిలోని సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పని తీరు ఉండాలి తప్ప స్టాటిక్ గా ఉండకూడదు అని తెలిపారు. ప్రతి చెరువు ఊరికి కన్నతల్లిలాగా పని చేసేది.. మనకు మంచినీళ్లు ఇచ్చింది, రజకులకు చాకిరేవు అయింది, మత్స్యకారులకు మత్స్య సంపద అయింది, చెరువు ఎండిపోతే బతుకు ఎండి పోతుంది కాబట్టి చెరువులను కాపాడుకున్నాము.. కన్నతల్లి పాత్ర పోషించిన చెరువు ఇవాళ దుర్గంధపూరితంగా మారిపోయింది అని ఆయన ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులతో కొట్లాడను అదే విధంగా సమస్యల పరిష్కారానికి మళ్లీ వారి దగ్గరికి వెళ్లే వాడిని అని చెప్పారు. కానీ, ఇప్పుడు ఆ సిస్టం లేదు.. ఏ సమస్య అయినా ముఖ్యమంత్రికి చెప్పే వాతావరణం ఉండాలి కానీ ఒక రాంగ్ ప్రాక్టీస్ రాజ్యమేలుతుంది ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు.
Read Also: Nikhil Gupta : ఉగ్రవాది పన్ను హత్య కేసు.. నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించిన చెక్ రిపబ్లిక్
Also Read
నేను మాత్రం ఏ పార్టీ ఎమ్మెల్యే అయిన, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాకున్న ఆలోచన ఒకటే.. ప్రజల సమస్యల కోసం ఎక్కడికైనా పోతా, ఎవరి దగ్గరకైనా పోతా, ఏ దరఖాస్తు అయిన ఇస్తా అని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నేను అధికారులను ఒకటే కోరుతున్నాను.. మీకు అన్ని గ్రౌండ్ నుంచి రిపోర్టులు వస్తాయి.. కాబట్టి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలి అని కోరారు. నాకు ఈ పదవి కొనుక్కుంటే వచ్చింది కాదు.. మల్కాజ్‌గిరి ప్రజలు ఆత్మను ఆవిష్కరించి పెట్టిన బిక్షగా భావిస్తా.. వారిచ్చిన ఆశీర్వాదంగా భావిస్తానన్నారు. మల్కాజ్‌గిరిలో మీరు గతంలో పడ్డ బాధలు లేకుండా పరిష్కరించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా.. గెలిచిన తర్వాత పార్లమెంట్లో ప్రధాని మోడీని కలిశాను.. మల్కాజ్‌గిరి ప్రజలు చూపిన ప్రేమ, ఆదరణ చూసి ముగ్ధుడైన మోడీకి మనపై ఒక ప్రత్యేక అభిమానం ఉంది.. కాబట్టి ఏ సమస్య అయినా పరిష్కరించే ప్రయత్నం చేస్తానని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!