జనగామ మండలంలోని శామీర్ పేట శివారులోని ఓ ఫంక్షన్ హల్ లో నిర్వహించిన జనగామ నియోజకవర్గ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తిలో తన ఓటమికి గల కారణాలపై కామెంట్ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. పాలకుర్తిలో నా ఓటమికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. ఏడు సార్లు నేనే ఉన్న కాబట్టి ఈసారి వేరే వాళ్లకు అవకాశం ఇవ్వలనుకున్నారే తప్ప, నా పై వ్యతిరేకతతో కాదని ఆయన అన్నారు. నన్ను పాలకుర్తి ప్రజలు వద్దనుకోలేదని, నియోజకవర్గం లో నేను గెలిస్తే జైల్లో పెడతానని,చెప్పుడు మాటలతో వదంతులు సృష్టించడంతో ఓటమి చెందనన్నారు. ఎన్టీ రామారావునే అప్పుడు ఓడించారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను నమ్మి ప్రజలు మోస పోయారన్నారు.
Shiva Balakrishna : ముగిసిన HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కస్టడీ విచారణ
తప్పుడు కేసులు పెట్టి బయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎవరూ బయపడవద్దని ఆయన వెల్లడించారు. సంవత్సరం ఓపిక పట్టండి కాంగ్రెస్ పార్టీ వాల్లు వాల్లే తగాదా పెట్టుకుంటారని, క్రిష్ణా జలాల వివాదం మొదలయింది, రేపు రేపు గోదావరి జలాల వివాదం వస్తదన్నారు. ప్రభుత్వం లేదని కార్యకర్తలు ఆందోళన చెందవద్దు, మీకు మా అండదండలు ఉంటాయి, ఏ కష్టం వచ్చిన ఆదుకుంటామని, కమీటీలలో కోన్ని లోపాలున్నాయి సమీక్ష నిర్వహించి, నూతన కమీటీలు వేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక గోదావరి జలాల వివాదం కూడ వస్తుందని చెప్పారు. ప్రభుత్వం లేదని కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. కార్యకర్తలకు తమ అండదండలు ఉంటాయని చెప్పారు. కమీటీలలో కొన్ని లోపాలున్నాయని, వాటిపై సమీక్ష జరిపి, కొత్త కమీటీలు వేస్తామని తెలిపారు.
Delhi: తప్పిపోయిన కొడుకు 22 ఏళ్లకు తిరిగొచ్చాడు.. ఆ తర్వాత ఏం షాకిచ్చాడంటే..!