ఉపాధి హామీ పై కేంద్ర వైఖరికి నిరసనగా జాతీయ స్థాయిలో రాష్ట్రాల సమిష్టి పోరాటం చేస్తున్నాయి. అయితే.. ఉపాధి హామీ పథకం పై కేంద్ర వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు – సవాళ్లు అనే అంశం పై హైదరాబాద్ రవీంద్ర భారతిలో సెమినార్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రాలపై కేంద్రం కక్ష, వివక్ష చూపుతోందన్నారు. ఉపాధి హామీ రద్దుకు కేంద్రం కుట్ర చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. కావాలనే రాష్ట్రాలకు కఠిన నియమాలు, వేధింపులు గురిచేస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్రం వ్యవహారం ఉందని, బడ్జెట్ లో ఉపాధి హామీకి 75 వేల కోట్ల కోత అన్నారు. ఉపాధి హామీలో దేశంలో నెంబర్ వన్ గా ఉన్న తెలంగాణకు ఇప్పటికే రూ.800 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. కూలీల పనిముట్లకు కూడా కోతలే అని ఆయన మండిపడ్డారు.
Also Read : CM KCR : ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్
ఉపాధి హామీలో కేవలం 20 పనులేనా!? అని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. పనికి రాని పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారని, శాశ్వత ప్రాతిపదిక పనులకు ప్రోత్సాహం లేదన్నారు. వ్యవసాయానికి అనుసంధానం అడిగినా లేదని, కేంద్రంపై కేరళ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి పోరాటానికి నిర్ణయమన్నారు. కలిసి వచ్చే రాష్ట్రాలతో కలిసే నిరసన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ – కేరళ రాష్ట్రాల పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎం బి రాజేష్ ల నిర్ణయించారు. జాతీయ స్థాయిలో ఉపాధి హామీ పటిష్ఠ అమలుకు, రాష్ట్రాల సమన్వయానికి, పోరాట వేదికగా వ్యవసాయ కార్మిక సంఘం ఉంటుందన్నారు.