Pawan Kalyan: టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన పవర్ స్టార్.. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత పవన్ కళ్యాణ్ – డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘జైత్ర రామ మూవీస్’ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.
READ ALSO: KTR: సిట్ విచారణ కంటే కార్తీక దీపం సీరియల్ బెటర్.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
వక్కంతం వంశీ అందించిన కథతో ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. నిజానికి పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం అవుతుంది. మేకర్స్ ఈ సినిమాను మార్చ్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూట్‌ని ప్రారంభించినున్నట్లు టాక్. ఈ విషయంపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో అభిమానులను అలరించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇందులో మరో హీరో కూడా కీలక పాత్రలో మెరిసే అవకాశం ఉందని సినీ సర్కిల్‌లో టాక్.
READ ALSO: Unbreakable Cricket Records: క్రికెట్ హిస్టరీలోనే అన్-బ్రేకబుల్ రికార్డ్స్.. ఏకంగా 199 సెంచరీలు!