Chiranjeevi – Ravi Teja : 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అన్నదమ్ములుగా నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ఈసారి సంక్రాంతికి మాత్రం ఈ ఇద్దరు స్టార్ హీరోలు వేర్వేరు చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రడీ అవుతున్నారు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, మరోవైపు మాస్ మహారాజా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో థియేటర్స్‌లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
READ ALSO: TGSRTC: సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ సన్నద్ధం.. పండుగకు 6431 ప్రత్యేక బస్సులు..!
ఈ ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలతో పాటు, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్, శర్వానంద్ హీరోగా నటించిన నారీనారీ నడుమ మురారీ చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఈసారి సంక్రాంతి పోరు చాలా టఫ్‌గా ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో రిలీజ్ అయిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో చిరు-రవితేజ కాంబినేషన్ వెండితెరపై సంచలనం సృష్టించింది. అన్నగా చిరు, తమ్ముడిగా రవితేజ… ఈ ఇద్దరూ కలిసి థియేటర్లను కిక్కిరిసేలా చేశారు. కానీ ఈసారి ఈ స్టార్ హీరోలు ఇద్దరూ కూడా వేరు వేరు చిత్రాలతో పండగ బరిలో నిలిచారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12న రిలీజ్‌కు రెడీ అవుతుండగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జనవరి 13న థియేటర్లలోకి రాబోతుంది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ యాక్షన్-కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా నయనతార కనిపించనుండగా, విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్‌లో ఆడియన్స్‌ను సప్రైజ్ చేయనున్నారు.
మరోవైపు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పూర్తిగా ఫ్యామిలీ డ్రామా విత్ కామెడీగా రూపుదిద్దుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో రవితేజకు జోడిగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆధునిక దంపతుల సమస్యలను ఫన్‌గా చూపిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. “ఇద్దరు భామల మధ్య నలిగిపోయే భర్త” కాన్సెప్ట్‌తో ఫుల్ మీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని మలిచినట్లు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. సంక్రాంతి సీజన్‌లో ఫ్యామిలీ ఆడియెన్స్ కీలకం. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ లాంటి హిట్ ఇచ్చిన చిరు-రవితేజ జోడీ ఈసారి వేర్వేరుగా పోటీ పడటంతో బాక్సాఫీస్ జోరు ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. ఈ రెండు చిత్రాలతో పాటు మరొక రెండు భారీ చిత్రాలు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో పండగ పోరు ఆసక్తికరంగా మారిందని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Katrina Kaif – Vicky Kaushal: తల్లిదండ్రులైన స్టార్ హీరో – హీరోయిన్..