Katrina Kaif – Vicky Kaushal: బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి వాళ్లు వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రత్యేకమైన వార్తతో వార్తల్లోకి ఎక్కారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటో తెలుసా.. వాళ్లిద్దరూ తల్లిదండ్రులయ్యారు. ఈ స్టార్ హీరో – హీరోయిన్‌కు కొడుకు పుట్టాడు. తాజాగా కత్రినా – విక్కీ తమ లిటిల్ ప్రిన్స్ పుట్టిన మూడు నెలల తర్వాత అతని మొదటి గ్లింప్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
READ ALSO: Jana Nayagan: ‘జన నాయగన్’కు కోర్టు షాక్.. ‘రాజా సాబ్’ సోలో ఎంట్రీ!
తాజా పోస్ట్‌లో ఈ స్టార్ కపుల్ వారి బాబు పేరును రివీల్ చేశారు. కత్రినా – విక్కీ తమ లిటిల్ చాంప్ చేయి పట్టుకున్న ఫోటోను పంచుకున్నారు. “మా కాంతి కిరణం’ విహాన్ కౌశల్’. మా ప్రార్థనలకు సమాధానం లభించింది, జీవితం అందంగా ఉంది. మా ప్రపంచం ఒక్క క్షణంలో మారిపోయింది” అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ‘విహాన్’ అనే పేరుకు అర్థం కొత్త ప్రారంభం, తెల్లవారుజామున మొదటి కిరణాలు అని అర్థం కూడా వస్తుంది. కత్రినా – విక్కీ డిసెంబర్ 9న రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ లో వివాహం చేసుకున్నారు. నవంబర్ 7, 2025న విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ దంపతుల జీవితాల్లోకి వారి కుమారుడు విహాన్ వచ్చాడు. అప్పటి నుంచి ఈ జంట వారి వ్యక్తిగత జీవితాల గురించి చాలా గోప్యంగా ఉంచారు. వారు విహాన్ పుట్టిన తర్వాత కూడా చాలా కాలం పాటు ఎటువంటి అధికారిక సమాచారాన్ని పంచుకోలేదు.
READ ALSO: Vaibhav Suryavanshi: సరికొత్త చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ..