ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఒక విధ్వంసకర చర్య అని మస్క్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో అమెరికాలోని పరిశ్రమలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆరోపించారు. మరో పోస్టులో ఈ బిల్లు రిపబ్లికన్‌ల యొక్క రాజకీయ ఆత్మహత్యగా పేర్కొంటూ నిర్వహించిన పోల్‌ను ప్రస్తావించారు. ఇది రుణ పరిమితిని 5 ట్రిలియన్ డాలర్లకు పెంచుతుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు.
Trump New Bill: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘‘బిగ్, బ్యూటీఫుల్ బిల్లు’’ ఆ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, ఈ బిల్లుపై ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకున్నారు. అయితే, ఈ బిల్లు ఇప్పుడు భారత్‌కి వచ్చే నిధులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Elon Musk: టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల సీఈవో.. ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన నుంచి వైదొలిగారు. ఫెడరల్ ప్రభుత్వంలో పునర్ఘటనం, వ్యర్థ వ్యయాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన “Department of Government Efficiency (DOGE)”లో ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన పనిచేశారు. తన అధికారిక పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో మస్క్ బుధవారం X ద్వారా ఈ ప్రకటన చేశారు. ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా నా నిర్ణీత కాలం…