Elon Musk: టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల సీఈవో.. ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన నుంచి వైదొలిగారు. ఫెడరల్ ప్రభుత్వంలో పునర్ఘటనం, వ్యర్థ వ్యయాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన “Department of Government Efficiency (DOGE)”లో ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన పనిచేశారు. తన అధికారిక పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో మస్క్ బుధవారం X ద్వారా ఈ ప్రకటన చేశారు. ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా నా నిర్ణీత కాలం…
Vivek Ramaswamy: అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కీలక పరిణామం జరిగింది. భారత అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక ప్రకటన చేశారు. ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన డోజ్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్టు వెల్లడించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. జనవరిలో ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు, ఆయన అనేక ముఖ్యమైన నియామకాలను కూడా ప్రకటించారు. ఇందులో బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు ప్రభుత్వ సమర్థత విభాగం (DOGE) బాధ్యతలు అప్పగించారు. మస్క్ ఎన్నికల్లో ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వడంతోపాటు భారీగా డబ్బు కూడా ఖర్చు చేసిన విషయం తెలిసిందే.