మండు వేసవిలో అకాలవర్షాలు అన్నదాతలకు ఇబ్బందులు తప్పడంలేదు. అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలు నిలువునా మునిగిపోయారు. కామారెడ్డి జిల్లాలో కల్లాల్లో ఆరబోసిన వడ్లన్నీ నీటిలో తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతులకు పెద్ద ఎత్తున నష్టం కలగనుంది. తెలంగాణ వ్యాప్తంగా సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్,
చిత్తూరు జిల్లాలో గజరాజులు బీభత్సం కలిగిస్తున్నాయి. రేణిగుంటలో ఏనుగుల బీభత్సంతో జనం హడలిపోతున్నారు. మొలగముడి గ్రామంలో 3 ఏనుగులు సంచారంతో రైతులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. పంట పొలాలపై వీరంగం సృష్టిస్తున్నాయి. చెరకు పంట నాశనం చేశాయి గుంపులుగా వచ్చిన ఏనుగులు. దీంతో భయాందోళనకు గురవుతున్నారు
విజయనగరం జిల్లాలో గజరాజుల కలకలంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.ఏపుగా పెరిగిన పంటల్ని గజరాజులు తినేయడం, ధ్వంసం చేయడంతో విజయనగరం జిల్లాలో రైతులు ఆవేదన చెందుతున్నారు. నాలుగేళ్ళుగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అధికారులపై మండిపడుతున్నారు.అటవీశాఖ అధికారులు స్పందించట్లేదని రైతులు ఆందోళనకు దిగారు