తాజాగా తమిళనాడు రాష్ట్రములోని నీలగిరి జిల్లాలో 30 అడుగుల బావిలో ఏనుగు పిల్ల పడిపోయింది. ఇక ఈ ఏనుగు పిల్లను కాపాడడానికి అటవీ శాఖ అధికారుల బృందం బుధవారం 11 గంటల పోరాటం జరిగింది. రెండు కొక్కులైన్స్ ను ఉపయోగించి జంతువును సురక్షితంగా రక్షించారు అధికార బృందం. ఈ విషయం సంబంధించి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడలూరు సమీపంలోని కోలపల్లి వద్ద ఏనుగుల గుంపులోని ఓ చిన్న ఏనుగు పిల్ల 30 అడుగుల బావిలో పడిన ఘటన చోటుచేసుకుంది.
Karthikeya: ఖైదీ టైపులో ఊహించుకున్నా.. తెలుగులో విలన్ ఆఫర్స్ : కార్తికేయ ఇంటర్వ్యూ
ఈ విషయాన్నీ స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు వెంటనే తగిన సహాయక చర్యలు చేపట్టారు. కోలపల్లి అటవీ శాఖ అధికారులు ఆ ఏనుగు పిల్లను రక్షించారు. అందులో భాగంగా ఏనుగు సురక్షితంగా ఎక్కడానికి బావి దగ్గర మార్గాన్ని రూపొందించేందుకు రెండు ఎక్స్‌కవేటర్లను ఏర్పాటు చేసారు. పిల్ల ఏనుగును రక్షించిన వెంటనే అధికారులు దానిని అడవిలోకి విడిచి పెట్టారు. దాంతో ఆ చిన్న ఏనుగు అడవిలోకి సంతోషంగా వెళ్ళిపోయింది. అటవీ శాఖ అధికారులు ఏనుగును పర్యవేక్షించారు. ఆ చిన్న ఏనుగు తన మందలో చేరే వరకు అలాగే చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
#WATCH | Tamil Nadu: A wild elephant fell into a 30-foot-deep pit in the Kolapalli area in the Nilgiris district, last night.
The elephant was rescued after around 11 hours by the forest department of Kolapalli. pic.twitter.com/xbRGevYi5N
— ANI (@ANI) May 29, 2024