ఎన్నికల చివరి దశకు ముందు అమ్మకాల ఒత్తిడి మధ్య భారత బెంచ్ మార్క్ సూచీలు బుధవారం ట్రేడింగ్ సెషన్ లో భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ 183 పాయింట్లు నష్టపోయి 22,704.7 వద్ద ముగియగా, బిఎస్‌ఇ సెన్సెక్స్ 667 పాయింట్లు నష్టపోయి 74,502.90 వద్ద స్థిరపడింది. నేటి మార్కెట్ లో.. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 250, నిఫ్టీ మైక్రోక్యాప్ 250 మినహా అన్ని సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని నష్టాలలో ముగిశాయి.
Viral video: బీచ్‌లో ఆడుతుండగా పిడుగుపాటు.. ముగ్గురు పిల్లలకు గాయాలు
నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్ లలో.. నిఫ్టీ మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్ లు లాభపడగా.. మిగితా అన్ని రంగాల సూచీలు నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 50లో నేడు టాప్ గెయినర్లుగా హిందాల్కో, దివీస్ ల్యాబ్, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, సిప్లాలు వరుసగా ఉన్నాయి. ఐకమరోవైపు., టాప్ లూజర్లలో హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఎస్‌బిఐ లైఫ్, టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ లు వరుసగా ఉన్నాయి. బుధవారం సెషన్ లో.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మొత్తం 2,715 స్టాక్‌లు ట్రేడ్ అవ్వగా.. 1,124 షేర్స్ లాభపడగా., 1,481 షేర్స్ క్షీణించాయి. అలాగే 110 షేర్స్ లో ఎటువంటి మారలేదు.
Sudheer Babu Wife: ఇప్పుడిలా ఉన్న మహేష్ బాబు చెల్లి.. అప్పుడు ఇలా ఉండేదా..?
ఇక బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.28 శాతం క్షీణించగా, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.29 శాతం పెరిగింది. ప్రపంచ మార్కెట్లలో, యెన్, యూరోలకు వ్యతిరేకంగా యూఎస్ డాలర్ బలపడింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్ కు 84.78 డాల్లర్స్ కి పెరిగాయి. ప్రస్తుతం 1 డాలర్ విలువ 83. 33 రూపాయలుగా కొనసాగుతుంది.