విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల జాతీయ స్పోర్ట్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ సరుత జెండా ఊపి ప్రారంభించారు.