Israel-Hamas War: సంధి ముగిసింది, యుద్ధం మొదలైంది.. ఇజ్రాయిల్ దాడి, 240 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ సంధి ముగియడంతో మళ్లీ యుద్ధం ప్రారంభమైంది. ఖతార్ మధ్యవర్తిత్వంతో వారం రోజుల పాటు కొనసాగిన కాల్పుల విరమణ, బందీలు-ఖైదీల మార్పిడి నిలిచిపోయింది. సంధిని పొడగించాలని ప్రపంచదేశాలు పిలుపునిచ్చినప్పటికీ.. ఇజ్రాయిల్ పునరుద్ధరించడానికి సిద్ధంగా లేదు. దీంతో గాజాపై ఇజ్రాయిల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. గాజా స్ట్రిప్‌పై శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 240 మంది మరణించినట్లు హమాస్ తెలిపింది.
ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి గడువు శుక్రవారంతో ముగిసింది. సాయం చేయడానికి ఈజిప్టు నుంచి రఫా బార్డర్ వద్దకు రావద్దని ఇజ్రాయిల్ ఎన్జీవోలకు చెప్పింది. ఇప్పటి వరకు సంధిలో భాగంగా హమాస్ తమ చెరలో ఉన్న 80 మంది ఇజ్రాయిల్ బందీలను వదిలిపెట్టింది. ఇజ్రాయిల్ తన జైళ్లలో ఉన్న 240 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయిల్‌పై చేసిన దాడిలో 1200 మందిని చంపింది, 240 మందిని బందీలుగా చేసుకుని గాజాలోకి తీసుకెళ్లింది.
Also Read
- US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
- Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
Read Also: Earthquak: ఫిలిఫ్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
సంధి ముగిసిన తర్వాత 400 కంటే ఎక్కువ టార్గెట్లపై ఇజ్రాయిల్ దాడులు చేసినట్లు సైన్యం శనివారం వెల్లడించింది. ఇన్నాళ్లు రక్షణగా ఉన్న దక్షిణ గాజాపై కూడా ఇజ్రాయిల్ బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. ఖాన్ యూనిస్ ప్రాంతంలో 50 కంటే ఎక్కువ లక్ష్యాలపై ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు దాడులు చేశాయి. అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 15 వేల కన్నా ఎక్కువ మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో 40 శాతం పిల్లలు ఉన్నారు.
అంతకుముందు సంధి ముగియడానికి మరింత సమయం ఉన్నప్పటికీ.. హమాస్ గాజా నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్లను ప్రయోగించింది. ఈ పరిణామాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ చర్యల వల్లే సంధి విఫలమైందని అమెరికా ఆరోపించింది. మరోవైపు గాజాపై మరోసారి దాడులు మొదలైనందుకు తీవ్రంగా చింతిస్తున్నట్లు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
మరోవైపు సంధి ముగియడంతో ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంలో లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా దాడుల్ని మళ్లీ ప్రారంభించింది. శనివారం సిరియా రాజధాని డమాస్కస్ పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసిందని సిరియా తెలిపింది. ఇదిలా ఉంటే మరో సంధి ఒప్పందాన్ని తీసుకురావడానికి పలు దేశాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
తాజావార్తలు
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!