Rishabh Pant: రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు.. చరిత్రలోనే తొలి వికెట్ కీపర్‌గా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) చరిత్రలో 3,000 పరుగులు పూర్తి చేసిన తొలి వికెట్‌కీపర్ బ్యాటర్‌గా రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో పంత్ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు 3,000 పరుగుల మార్కుకు 52 పరుగుల దూరంలో ఉన్న పంత్, తన ఇన్నింగ్స్‌లో ప్రత్యేకమైన బ్యాటింగ్ శైలిని కనబరిచాడు.
ఆరంభంలో ప్రమాదకర షాట్ల జోలికి వెళ్లకుండా సింగిల్స్, డబుల్స్ తీస్తూ జాగ్రత్తగా ఆడాడు. ఆ తర్వాత గేర్ మార్చి న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 55 బంతుల్లో తన టెస్ట్ కెరీర్లో 22వ అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పంత్ 62 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీనితో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తర్వాత WTCలో 3,000 పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా కూడా పంత్ నిలిచాడు.
Also Read
- Iran US Tensions: అమెరికా ఎఫ్-16పై ఇరాన్ క్షిపణి దాడి!
- CM Revanth Reddy :తెలంగాణ ఎగుమతుల్లో 68% వృద్ధి.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే లక్ష్యం
- Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
- PM Modi: నా మాట విని బంగారం కొనడం తగ్గించారు.. ఇప్పుడు లాభపడ్డారు..
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ ధాటిగా బ్యాటింగ్ చేసి మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 486 పరుగులు చేసి 118 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ కీలక భాగస్వామ్యంతో జట్టును బలమైన స్థితిలో నిలిపారు. పడిక్కల్ 53 పరుగులతో సంయమనంతో ఆడగా, రాహుల్ 290 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 136 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
రాహుల్ ఔటైన తర్వాత శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడుతూ కేవలం 66 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 104వ ఓవర్లో నాథన్ స్మిత్ బౌలింగ్‌లో రాహుల్ 136 పరుగుల వద్ద బౌల్డ్ అయ్యాడు. అనంతరం గిల్, పంత్ కలిసి భారత్ స్కోరును 400 పరుగులు దాటించారు. న్యూజిలాండ్ బౌలర్లు వికెట్లు తీసేందుకు తీవ్రంగా శ్రమించగా, భారత బ్యాటర్లు నిలకడగా రాణించి మ్యాచ్‌పై పట్టు సాధించారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
Rishabh Pant: రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు.. చరిత్రలోనే తొలి వికెట్ కీపర్‌గా..
-
Iran US Tensions: అమెరికా ఎఫ్-16పై ఇరాన్ క్షిపణి దాడి!
-
CM Revanth Reddy :తెలంగాణ ఎగుమతుల్లో 68% వృద్ధి.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే లక్ష్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
PM Modi: నా మాట విని బంగారం కొనడం తగ్గించారు.. ఇప్పుడు లాభపడ్డారు..
ట్రెండింగ్
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!