Artiste Movie First Glimpse: సంతోష్ కాల్వచెర్ల, క్రిషిక పటేల్ హీరో హీరోయిన్లుగా ఆర్టిస్ట్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు రతన్ రిషి డైరెక్ట్ చేస్తుండగా ఎస్ జె కె ప్రొడక్షన్స్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. తణికెళ్ల భరణి, సత్యం రాజేష్, ప్రభాకర్, వినయ్ వర్మ, భద్రం, తాగుబోతు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఆర్టిస్ట్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రతన్ రిషి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో కళ ఉంటుందని, అయితే అది టైమ్ వచ్చినప్పుడు బయటపడుతుందని అనాన్రు. అందరి ఆర్టిస్టుల్లాగే నేనొక ఆర్టిస్టును పరిచయం చేశా, అయితే అతను వైలెంట్ గా ఉంటాడు, మా సినిమా గ్లింప్స్ చూస్తే ఇది థ్రిల్లర్ అనుకుంటారు కానీ ఇందులో లవ్, ఎమోషన్, కామెడీ వంటి అన్ని షేడ్స్ ఉంటాయని అన్నారు.
Animal : రశ్మికతో రణబీర్.. మోస్ట్ వయిలెంట్ ఫస్ట్ నైట్ ప్లాన్ చేశారట!
డార్క్ కామెడీలా సీన్స్ ఉంటాయని పేర్కొన్న ఆయన ప్రొడ్యూసర్ నా కోసమే ఈ ప్రాజెక్ట్ చేశారని అన్నారు. ప్రభాకర్ ఎంట్రీతో వచ్చే సీన్ నుంచి మా సినిమా మొదలవుతుందని, ఆ సీన్ నుంచే థియేటర్స్ లో ఫోన్స్ పక్కన పెట్టేసి సినిమాలోకి వెళ్లిపోతారని అన్నారు. హీరో సంతోష్ కల్వచర్ల మాట్లాడుతూ మా ఆర్టిస్ట్ మూవీ చిన్న ప్రాజెక్ట్ గా స్టార్ట్ అయ్యిందని, మా ప్రొడ్యూసర్ వచ్చిన తర్వాత పెద్ద ఆర్టిస్టులు అంతా జాయిన్ అయ్యారని అన్నారు. ఇంతమంది పేరున్న నటీనటులు మా సినిమాలో ఉండటం నాకే షాకింగ్ గా ఉండేదని గ్లింప్స్ లాగే సినిమా కూడా మీకు నచ్చుతుందని అన్నారు. హీరోయిన్ క్రిషిక పటేల్ మాట్లాడుతూ ఆర్టిస్ట్ మూవీతో టాలీవుడ్ లోకి రావడం హ్యాపీగా ఉందని, ఇదొక మంచి మూవీ మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా అని కోరింది.