బాబూ జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ వారసత్వాన్ని పుణిపుచ్చుకుని దేశ అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు జగజ్జీవన్ రామ్.. అట్టడుగు వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకే చంద్రబాబు పి 4 పథకం ప్రవేశ పెట్టారు..గత ప్రభుత్వం బాబూ జగజ్జీవన్ రామ్ విషయంలో చిన్న చూపు చూసింది.. దళితులు అంటేనే జగన్మోహన్ రెడ్డికి చులకన.. అందుకే…
Dokka Manikya Vara Prasad : మాజీ సీఎం జగన్ మీడియా సమావేశంలో పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా కోర్ట్ వేసిన చార్జెస్ లో పేరు లేదు అంటున్నారని, నీ హయంలో జరిగిన దానికి నువ్వు కాక ఎవరు బాధ్యత వహించాలన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. అదానీ డబ్బు నువ్వు తినకపోతే ఎవ్వరూ తిన్నారు నువ్వే చెప్పు అని ఆయన…
గుంటూరు జిల్లా తాడికొండలో సాధికార సభ నిర్వహించారు. ఈ సభలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదని అన్నారు. తనకు గతంలో తాడికొండలో పోటీ చేయమని అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని.. తాడికొండ అభ్యర్థి నువ్వే అని సీఎం కూడా చెప్పారన్నారు. తనకు సంబంధం లేకుండానే సమన్వయకర్తగా నియమించారని తెలిపారు.
గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. తాడికొండ పంచాయితీ ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వదరకు చేరడంతో ఇది చర్చకు దారితీస్తోంది. అయితే.. తాడికొండ నియోజకవర్గ వైసిపి అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించడంపై స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో పాటు ఆమె వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక డొక్కాను వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని ఎమ్మెల్యే వర్గం డిమాండ్ చేస్తోంది. ఈనేపథ్యంలో.. తాజాగా ఎమ్మెల్యే శ్రీదేవి…
తాడికొండ నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, తాడికొండ సమన్వయకర్తగా తనను పార్టీ అధిష్టానం నియమించిందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరులో ఎన్టీవీతో మాట్లాడిన ఆయన తాడికొండ నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులపై స్పందించారు. తాడికొండ సమన్వయకర్తగా తనను పార్టీ అధిష్టానం నియమించిందని తెలిపారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయకత్వంలో అందరినీ కలుపుకుని పార్టీ పటిష్టానికి కృషి చేస్తానని అన్నాడు. రెండు రోజుల్లో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కలుస్తాఅని, ఎమ్మెల్యే శ్రీదేవి బాగా తెలిసిన వ్యక్తిఅని పేర్కొన్నారు. రెండు మూడు…