క్యాన్సర్ మరియు మధుమేహం వంటి, గుండె జబ్బుల కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అంతేకాకుండా గుండె జబ్బులతో చాలామంది చనిపోతున్నారు. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. చాలా మంది ఉన్నట్టుండి అకస్మాత్తుగా చనిపోతున్నారు. అయితే గుండె జబ్బులనుండి బయటపడడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వారంలో ఒక్కరోజు వ్యాయామం చేసినా గుండె జబ్బులు తగ్గుతాయని.. తాజా పరిశోధనలో తేలింది.
Crime News: ఆ యువతితో సన్నిహితంగా ఉంటే తట్టుకోలేక.. మద్యం కోసం పిలిచి చంపేశాడు!
హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధన ప్రకారం.. వారానికి ఒకసారి వ్యాయామం చేసేవారిలో గుండెపోటు, గుండె ఆగిపోవడం వంటి వ్యాధుల కేసులు తక్కువగా ఉన్నాయి. ఈ పరిశోధనలో 9 వేల మందికి రొటీన్ గా కనిపించింది. ఇతర వ్యక్తులతో పోలిస్తే వారి జీవనశైలిలో వ్యాయామం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.
Perni Nani: సై అంటే సై.. పవన్ వ్యాఖ్యలకు పేర్నినాని కౌంటర్
గుండె జబ్బులు రాకుండా ఉండడానికి.. జాగింగ్, సైక్లింగ్ మరియు స్విమ్మింగ్ వంటి వ్యాయామం చేస్తే చాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వ్యాయామాలు చేయడం ద్వారా.. హృదయనాళ పనితీరు బలంగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ వ్యాయమం ఒకటి రెండు రోజులు చేసినా గుండెలో రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా అదుపులో ఉంటుంది. అలాంటి పరిస్థితిల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
Dera Baba: డేరా బాబాకు మరోసారి పెరోల్..జైల్లో కంటే అక్కడే ఎక్కువ..!
ప్రజల ఆహార విధానంలో మార్పుల వల్లనే గుండెపోటుకు గురవుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ లాంటి ఆహారం తినడం వల్ల.. గుండె వ్యాధులకు గురవుతున్నారు. అంతేకాకుండా రాత్రి ఆలస్యంగా పడుకోవడం.. ఆలస్యంగా నిద్రలేవడం అలవాటుగా మారింది. ఇలాంటి అలవాటు కూడా గుండె జబ్బులను పెంచుతుంది. అంతేకాకుండా ప్రజలు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులను చాలా వరకు నివారించవచ్చు.