డేరా బాబా పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు ఈ పేరు తెగ వినిపించేది.. అతి తక్కువ కాలంలోనే బాగా ఫెమస్ అయ్యాడు.. అత్యాచార ఘటనతో జైల్లో ఉంటున్నాడు.. సిర్సాలోని తన ఆశ్రమ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న అతను హర్యానాలోని సునారియా జైలులో 2017 నుండి ఖైదు చేయబడ్డాడు. అంతకుముందు ఫిబ్రవరిలో, డేరా చీఫ్‌కు మూడు వారాల ఫర్లో మంజూరు చేయబడింది. ప్రస్తుతం రోథక్‌లోని సునారియా జైలులో ఉన్నాడు. పెరోల్ కోసం అతని దరఖాస్తు అంగీకరించారు. గురువారం సాయంత్రం వరకు బెయిల్ బాండ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అతను సిర్సా ఆశ్రమాన్ని సందర్శించడానికి కోర్టుకు నిరాకరించడంతో బాగ్‌పత్‌లోని బర్వానాలోని తన ఆశ్రమానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది..
ఆరుసార్లు జైలు నుంచి బెయిల్ తీసుకున్నాడు.. ఇప్పుడు దీంతో కలిపి 7 సార్లు బయటకు వచ్చారు.. Aaఅక్టోబరు 24, 2020న మొదటిసారిగా, అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కలవడానికి ప్రభుత్వం అతనికి ఒక రోజు పెరోల్ మంజూరు చేసింది. అనారోగ్యంతో ఉన్న తల్లిని రెండవసారి కలిసేందుకు 21 మే 2021న 1 రోజు పెరోల్ మంజూరు అయింది.7 ఫిబ్రవరి 2022న, హర్యానా ప్రభుత్వం అతనికి 21 రోజుల పెరోల్ మంజూరు చేసింది.. జూన్ 2022న, రామ్ రహీమ్‌కి మళ్లీ ఒక నెల పెరోల్ ఇచ్చారు.అక్టోబర్ 2022న, రామ్ రహీమ్ మరోసారి 40 రోజుల పెరోలపై బయటకు వచ్చాడు..
2002 జూలై 10న హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా ఖాన్‌పూర్ కొలియన్ గ్రామంలో తన పొలాల్లో పని చేస్తున్నప్పుడు కురుక్షేత్రలోని ఖాన్‌పూర్ కొలియన్ గ్రామానికి చెందిన రంజిత్ సింగ్ హత్యకు గురయ్యాడని ఆరోపణలు వచ్చాయి. సమగ్ర దర్యాప్తు తర్వాత, సిబిఐ ఆరుగురు నిందితులపై 2007లో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 2008లో అభియోగాలు నమోదు చేయగా, అక్టోబర్ 8, 2021న డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసుకు సంబంధించి కోర్టు డేరా బాబా, మరో నలుగురిని దోషులుగా నిర్ధారించింది.. నెల రోజుల తర్వాత మళ్లీ జైలుకు తిరిగి వెళ్లనున్నాడు..