Crime News: ఆ యువతితో సన్నిహితంగా ఉంటే తట్టుకోలేక.. మద్యం కోసం పిలిచి చంపేశాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: తాను ప్రేమిస్తున్న యువతి మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందన్న నెపంతో సదరు యువకుడిని అతిదారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్ కొత్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శంషాబాద్ డీసీపీ కార్యక్రమంలో డీసీపీ నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన రాజ్ కపిల్ సాహు అనే యువకుడు కొత్తూరులోని హెచ్‌ఐఎల్ వాచ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కాగా రాజ్ కపిల్ స్నేహితుడైన రాహుల్ సింగ్ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అదే యువతిని రాజ్ కపిల్ సాహు కూడా ప్రేమిస్తున్నాడు. ఇదిలా ఉండగా రాహుల్ సింగ్ ఆ యువతిని లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పగా అందుకు యువతి నిరాకరించింది.
Also Read: Meerut: ఒక అమ్మాయి, నలుగురు స్నేహితులు.. మూడు హత్యలు.. మళ్లీ వెలుగులోకి..!
Also Read
రాజ్ కపిల్‌తో చనువుగా ఉండటంతోనే తనతో పెళ్లికి నిరాకరించిందని కోపం పెంచుకున్న రాహుల్ సింగ్ తన స్నేహితుడైన రాజ్ కపిల్‌ను ఎలాగైనా అంతమొందించాలని పథకం పన్నాడు. అందులో భాగంగా రాహుల్ సింగ్, తాహేర్, మరో ఇద్దరు మైనర్ బాలురు కలిసి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని జనసాయి వెంచర్‌కు తీసుకువెళ్లారు. ముందుగా అనుకున్నట్లుగా అందరూ కలిసి మద్యం సేవించారు. ఆపై నలుగురు కలిసి రాజ్ కపిల్‌పై పగిలిన సీసాలతో దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర గాయాలపాలైన రాజ్ కపిల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. రాజ్ కపిల్ తిరిగి రాకపోవటంతో అనుమానం వచ్చిన అతని స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 24 గంటల్లో కేసును చేధించిన పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..