అసెంబ్లీ కార్యదర్శినీ కలిసిన డీకే అరుణ… ఎన్నికల సంఘం జారీ చేసిన కాపీనీ అసెంబ్లీ కార్యదర్శికి అందజేసి వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. గద్వాల అసెంబ్లీ ఎన్నిక గెలిచిన అభ్యర్థి అఫిడవిట్ పైన పిటిషన్ వేశానని, గద్వాల ఎమ్యెల్యేని అనర్హుడిగా ప్రకటిస్తూ నన్ను ఎమ్యెల్యేగా హై కోర్టు తీర్పుఇచ్చిందని ఆమె వివరించారు. నిన్న కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని, తెలంగాణ గెజిట్ నోటిఫికేషన్ లో వెంటనే నా పేరును పబ్లిష్ చేయాలని చెప్పిందన్నారు. అసెంబ్లీ స్పీకర్, సెక్రెటరీకి రిప్రజెంటేషన్ ఇచ్చామని, స్పీకర్ అందుబాటులో లేరు వారి ఆఫీస్ లో లెటర్ ఇచ్చానన్నారు. స్పీకర్ అందుబాటులో లేరు.. కాల్ లో అవైలబుల్ గా లేరని, కేంద్ర ఎన్నికల సంఘం.. సీఎస్, అసెంబ్లీ సెక్రెటరీ కు ఆదేశాలు ఇచ్చారన్నారు.
Also Read : Bigg Boss 7: ఆ ఎక్స్ కంటెస్టెంట్ తో బ్రేకప్.. రతికా రోజ్ కాదు ప్రియా.. ఈమె బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా!
అంతేకాకుండా..వీలైనంత తొందరగా నా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ఆమె కోరారు.. ఇప్పటికే లేట్ అయ్యిందని, వెంటనే ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని కోరుతున్నా అని ఆమె అన్నారు. సుప్రీం లో కృష్ణ మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ పై డీకే అరుణ మాట్లాడుతూ.. కోర్ట్ లో మా లాయర్లు చూసుకుంటారు.. #హై కోర్ట్ ను నిర్లక్ష్యంగా చూసారు.. ఇక్కడ ఎప్పుడు కౌంటర్ వేయకుండా సుప్రీం కోర్ట్ కి వెళ్లారు.. ఉద్దేశ్య పూర్వకంగానే కేసును తప్పు దారి పట్టించాలని చూస్తున్నారు.. 2019 డిసెంబర్ లో పిటిషన్ వేశాను.. అప్పటి నుంచి ఎందుకు కౌంటర్ ధాఖలు చేయలేదు.. అప్పటి నుంచి హై కోర్ట్ ని ఆశ్రయించకుండా ఇప్పుడెందుకు వెళ్లారు అని ఆమె తెలిపారు.
Also Read : OG : రికార్డు స్థాయిలో ఓజి ఓవర్సిస్ రైట్స్ కొనుగోలు చేసిన ప్రముఖ సంస్థ..?