Rathika rose is Patas Priya: బిగ్ బాస్ 7 అట్టహాసంగా ప్రారంభమైపోయింది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో సెప్టెంబర్ 3 అంటే ఈ ఆదివారం నుంచి ప్రసారమవుతుంది. ఇక ఈ షోలో 21 మంది కంటెస్టెంట్లు అని ముందు నుంచి ప్రచారం జరిగింది కానీ అనూహ్యంగా కేవలం 14 మంది మాత్రమే హౌస్ లోకి వెళ్లారు.. వారిలో రతిక రోజ్ అనే అమ్మాయి కూడా హౌస్ లోకి వెళ్ళింది. వెళ్లిన మొదటి రోజే అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె హాట్ టాపిక్ అవుతుంది. ఆమె గురించి చెప్పాలంటే 2020లో షకలక శంకర్ నటించిన “బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది” చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆశించిన స్థాయిలో ఆడక పోవడంతో ఆమెకు గుర్తింపు రాలేదు.
Dhanush : వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న స్టార్ హీరో..
ఇక బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన “నేను స్టూడెంట్ సర్” సినిమాలో ఒక పోలీసు అధికారిగా నటించగా ఈ పాత్ర ఆమె మంచి క్రేజ్ తీసుకువచ్చింది. అయితే ఈ భామ గురించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే రతికా రోజ్ అనేది ఆమె అసలు పేరు కాదట ముందుగా ఆమె ప్రియా అనే పేరుతో గతంలో ఈటీవీలో ప్రసారమైన పటాస్ షోలో అనేక ఎపిసోడ్లలో కూడా కనిపించిందని తెలుస్తోంది. ఇక ఆ షో తర్వాత పలు సినిమాలలో కూడా కనిపించిందని చిన్న చిన్న పాత్రలు కావడంతో పెద్దగా గుర్తింపు కూడా దక్కలేదని అంటున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్న ఒక వ్యక్తితో ప్రేమాయణం కూడా నడిపిందని బ్రేకప్ తో చాన్నాళ్ల పాటు ఇబ్బంది పడిందని తెలుస్తోంది. అందుకే మొదటి రోజు నాగార్జున ఆమెకు బ్రేక్ అయిన హార్ట్ ఇచ్చి లోపలికి పంపించాడని ఈ విషయం అంతా బిగ్ బాస్ నిర్వాహకులకు ముందే తెలుసు అని అంటున్నారు.