పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సుజిత్ ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం గ్యాంగ్ స్టార్ లా కనిపించనున్నాడు.దీనితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్బంగా రిలీజైన ఓజీ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.ఈ గ్లింప్స్ వీడియో లో పవన్ కళ్యాణ్ కూడా ఇంతకుముందెప్పుడూ కనిపించని విధంగా ఎంతో కొత్తగా కనిపించాడు . దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఓజీ గ్లింప్స్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఓజి గ్లింప్స్ కు అద్భుత రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.తాజాగా సమాచారం ప్రకారం.. ఓజీ ఓవర్ సీస్ రైట్స్ రికార్డ్ స్థాయి రేటుకు అమ్ముడయ్యాయని సమాచారం.. నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ కోసం రూ.20 కోట్లకు పైగా కోట్ చేయగా.. ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ రూ.13 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం… ఈ సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగడానికి రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ కూడా ఒక కారణమని సమాచారం.మరి విడుదలకు ముందే ఈ రేంజ్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.