హైడ్రా చర్యలకు దివ్యానగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. కూల్చివేతలుపై హైడ్రాను స్వాగతించారు. సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీతో హైడ్రా కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. "20 ఏళ్లుగా నల్ల మల్లారెడ్డి అరాచకాలు ఎదురుకుంటున్నాం.. దివ్యా నగర్ లే ఔట్ చుట్టూ గోడను నిర్మించి చుట్టుపక్కల కాలనీ వాసులకు ఇబ్బంది పెట్టాడు..
పోచారంలో హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. కూల్చివేతల అనంతరం ప్రకటన విడుదల చేశారు. “దీప్తి శ్రీనగర్‌లోని 200 ఎకరాల్లో లే అవుట్ ను నల్ల మల్లారెడ్డి డెవలప్ చేశారు. లే అవుట్ లో 2,200 ప్లాట్లను సింగరేణి ఎంప్లాయీస్ తో పాటు ప్రైవేట్ వ్యక్తులు కొన్నారు. లే అవుట్ ఒప్పందం ప్రకారం నల్ల మల్లారెడ్డి రోడ్లు, డ్రైనేజ్ డెవలప్ చేయాలి. కానీ సెక్యూరిటీ పేరుతో 200 ఎకరాల లే అవుట్ చుట్టూ ఎత్తైన…
హైడ్రా కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. ఘట్కేసర్‌లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్‌ను కూల్చివేతకు హైడ్రా రెడీ అయ్యింది. నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు అనేకమైన ఫిర్యాదులు అందాయి. సర్వే చేసి హైడ్రా.. అది ప్రభుత్వ స్థలం అని నిర్ధారించి, కూల్చివేతలకు సిద్ధమైంది. ఇప్పటికే అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.