Sri Lankan Bowler: క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్ ఎలా ఉంటుంది? తొమ్మిది ఓవర్లు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 8 వికెట్లు తీసిన బౌలర్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. లేదా ఎప్పుడైనా చూశారా ? శ్రీలంకకు చెందిన ఓ యువ బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. సెల్వశకరన్ రిషియుధన్ అనే 10 ఏళ్ల యువ బౌలర్ 9.4 ఓవర్లు వేసి, మొత్తం 9 ఓవర్లకు మెయిడిన్ చేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 8 వికెట్లు పడగొట్టాడు.
శ్రీలంక బౌలర్ అద్భుతం
ఈ శ్రీలంక బౌలర్ బౌలింగ్ ప్రదర్శన చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తన అద్భుత ప్రదర్శన తర్వాత, ఈ బౌలర్ మాట్లాడుతూ, ఒకే ఓవర్‌లో 6 రకాల బంతులు ఎలా వేయాలో నాకు తెలుసు. ఇందులో ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్, క్యారమ్ బాల్, లూప్, ఫ్లాట్ లూప్, ఫాస్ట్ బాల్ ఉన్నాయి. నా ఫేవరెట్ బౌలర్ నాథన్ లియాన్. అతనిలా బౌలింగ్ చేయడం ఇష్టం. నాకు 19 ఏళ్ల వయసులో శ్రీలంక తరఫున ఆడాలని ఉంది.
Read Also:Winter Season Foods: చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే వీటిని తప్పక తీసుకోవాలి..
నాథన్ లియాన్ ఆస్ట్రేలియాకు చెందిన ఆఫ్-స్పిన్ బౌలర్, అతని పేరు ప్రపంచంలోని గొప్ప స్పిన్నర్లలో చేర్చబడింది. ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకు మొత్తం 496 వికెట్లు తీశాడు. 36 ఏళ్ల లయన్ 4 వికెట్లు తీసిన వెంటనే 500 టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అతను వన్డే ఫార్మాట్‌లో 29 వికెట్లు, టీ20 ఫార్మాట్‌లో 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 50 పరుగులకు 8 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ బౌలింగ్. ఇది కాకుండా, అతను 203 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 370 ఇన్నింగ్స్‌లలో మొత్తం 736 వికెట్లు తీశాడు.
లథన్ లియాన్‌ను తన స్ఫూర్తిగా భావించే సెల్వస్కరన్ రిషియుధన్ శ్రీలంకకు చెందినవాడు. శ్రీలంక ఎల్లప్పుడూ ప్రపంచ క్రికెట్‌కు గొప్ప స్పిన్ బౌలర్లను అందించింది. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ముత్తయ్య మురళీధరన్ కూడా శ్రీలంకకు చెందినవాడు. మురళీధరన్ టెస్ట్ క్రికెట్‌లో మొత్తం 800 వికెట్లు పడగొట్టాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 51 పరుగులకు 9 వికెట్లు. ఇది కాకుండా వన్డే ఫార్మాట్‌లో 534 వికెట్లు, టీ20 ఫార్మాట్‌లో 13 వికెట్లు తీశాడు. అంటే ఈ శ్రీలంక దిగ్గజ బౌలర్ అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 1300 వికెట్లకు పైగా పడగొట్టాడు.
Read Also:Jabardasth Faima : హాస్పిటల్ బెడ్ పై జబర్ధస్త్ ఫైమా.. ఆందోళనలో ఫ్యాన్స్..