బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్‌లో భారత స్టార్ షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్‌లోకి ప్రవేశించాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 590 స్కోర్ చేసి ఏడో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్ అనంతరం స్వప్నిల్ మాట్లాడుతూ.. ధోనీని తన ఆరాధ్యదైవంగా భావిస్తున్నానని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండాలనే స్ఫూర్తి ధోనీ నుంచి వచ్చిందని చెప్పాడు. ధోనీ తనకు ఆదర్శమని అని అన్నాడు.
వారణాసిలోని పరమానందపూర్‌కు చెందిన కళావతి దేవి అనే 103 ఏళ్ల వృద్ధురాలు యువతకు ఆదర్శంగా నిలుస్తుంది. అందుకు కారణం తన ఫిట్‌నెస్. 103 ఏళ్ల వయసులో కూడా ట్రాక్‌పై పరుగెత్తుతూ ఫిట్‌గా ఉండాలనే సందేశాన్ని యువతకు తెలుపుతుంది. ఇదిలా ఉంటే.. కాశీలో జరిగిన ఎంపీ క్రీడా పోటీల్లో 100 మీటర్ల పరుగు పందెంలో ఆమే పేరును నమోదు చేసుకుని.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.