మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేట మండలం బొమ్మరాజుపేట రైతులకు మద్దతుగా శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ వెళ్లారు. 50 ఏళ్ల క్రితం కొనుక్కున్న 1,050 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారని.. కేసీఆర్ బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తున్నారని రైతులు ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం ముందు రైతులకు ధర్నాకు అనుమతి ఇచ్చి.. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Jogi Ramesh: పవన్ ఎక్కడ నుంచి పోటీ చేసినా.. వాలంటీర్‌ని నిలబెట్టి అతడ్ని ఓడిస్తాం
తెలంగాణ రాష్ట్రం వచ్చాక భూముల సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, పేదవారికి ఇబ్బంది లేకుండా భూప్రక్షాళన చేస్తా అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కానీ.. విమర్శలు రావడంతో ధరణి పోర్టల్ ను తీసుకువచ్చారు.. ధరణి పేరుతో దేశానికే ఈ రాష్ట్రం ఆదర్శం చేస్తాం అని కేసీఆర్ అన్నారని ఈటల తెలిపారు. ఇది రైతులకు మేలు చేస్తుందా కొంపలు ముంచడానికా అని చాలా మంది ఆరోజే అన్నారు అని బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కొంపలు ముంచడానికే ధరణి పోర్టల్ అని చెప్పడానికి సజీవ సాక్ష్యం ఈ బొమ్మరాజుపేట కేసు అని ఈటల అన్నారు.
Read Also: Vikarabad: తాండూరు ఆర్టీసీ టికెట్ చెకింగ్ టీం అధికారుల వెహికిల్ లో చోరీ
సర్వే నంబర్ 323 నుంచి 409 వరకు 1,050 ఎకరాల భూములలో 50 ఏళ్లుగా రైతులు పంట సాగు చేసుకుంటున్నారని ఈటల రాజేందర్ అన్నారు. నేను1999 నుంచి 41 సంవత్సరాలుగా ఉంటున్నా.. ఇక్కడ ఉన్న వారందరూ నాకు తెలుసు.. గ్రేప్ గార్డెన్ పెట్టుకున్నారు, పౌల్ట్రీ ఫాం పెట్టుకున్నారు.. ధరణి పేరు చెప్పి ఇప్పుడు కేసీఆర్, ఆయన బందువులు, తాబేదారులు 50 ఏళ్ల కింద కొనుక్కున్న రైతులను ఇబ్బంది పెడుతున్నారు అని ఈటల రాజేందర్ ఆరోపించారు. నేను డిమాండ్ చేస్తున్నా..
కేసీఆర్ ఏళ్లకాలం నీ రాజ్యం నడవదు.. మట్టిని నమ్ముకున్న రైతుల జోలికి వస్తే నీ భరతం పడతామని ఆయన మండిపడ్డారు.
Read Also: Asian Athletics Championship: ఆసియా అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రా అమ్మాయి..
ఎమ్మార్వోలు, ఆర్డీవోలు కుర్చీల్లో కూర్చుంది పేద రైతుల కోసమా? బ్రోకర్ల కోసమా? రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ కూర్చుంటారా?.. రైతులే భూకబ్జాకారులు అని ఓ న్యూస్ పేపర్ లో రాస్తున్నారు.. ఆ పత్రిక ఎవరికి ఊడిగం చేస్తుందో అందరికీ తెలుసు.. కేసీఆర్ పేదల కళ్ళలో మట్టి కొడుతున్నారు.. కలెక్టర్ స్పందించక పోతే మీ సంగతి చూస్తామని ఈటల రాజేందర్ హెచ్చరించారు. అధికారులు పిచ్చి వేషాలు బంద్ చేయ్యాలి.. సెటిల్ చేసుకోండి అని చెప్తున్నారట మీ భరతం.. బ్రోకర్ల భరతం పడతాం.. రైతులకు అండగా ఉంటాం.. ధరణీలో లక్షల మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు.. వాటిని వెంటనే పరిష్కరించాలి అనిబీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.