Minister Jogi Ramesh Satires On Pawan Kalyan: జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి జోగి రమేష్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీచేస్తాననే సవాల్ స్వీకరిస్తే.. అతను ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ వాలంటీర్‌ని నిలబెట్టి, అతడ్ని ఓడిస్తామని ఛాలెంజ్ చేశారు. పవన్‌ని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎవరూ అవసరం లేదని, కేవలం వాలంటీర్ చాలని ఎద్దేవా చేశారు. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించే దమ్ము పవన్‌కి ఉందా? అని నిలదీశారు. వాలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వాన్ని, ప్రజల్ని, వాలంటీర్లను చాలా బాధించాయన్నారు. వాలంటీర్ల వల్ల సచివాలయ సంస్థలు సక్సెస్ కావడాన్ని పవన్ జీర్ణించుకోలేకే.. ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
Dadisetti Raja: 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన సముద్రంలో కలిసిపోవడం ఖాయం
తెలంగాణలో నివసిస్తున్న పవన్ కళ్యాణ్‌కు ఏపీలోని వాలంటీర్ వ్యవస్థ గురించి ఎలా తెలుస్తుందని జోగి రమేష్ ప్రశ్నించారు. ప్రజలపై పవన్‌కి ప్రేమాభిమానం ఉంటే.. పొత్తులకు పోకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని సవాల్ విసిరారు. అసలు పవన్‌కు సీఎం జగన్ గురించి, మహిళల భద్రతపై మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇచ్చిన కాగితాలు చూసి పవన్ చదువుతున్నారని విమర్శించారు. పవన్‌కి ఏపీతో సంబంధమే లేదని తేల్చి చెప్పారు. ఇక పురోహితులకు రిటైర్మెంట్ అనేదే లేదని.. వారు ఎక్కడైనా పౌరోహిత్యం చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. అన్నవరంలో పురోహితులను వేలంపాట వేసిన విషయం తమ దృష్టికి రాలేదన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, భాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Namratha Shirodkar :ఐదు పదుల వయసులో ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో నమ్రత..
అంతకుముందు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా మంత్రి జోగి రమేష్ ఓ విషయంపై ఛాలెంజ్ చేశారు. వైసీపీ ఇస్తున్న నవరత్నాలు, జగన్ చేస్తున్న సంక్షేమం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారని.. గడప గడపకు వెళ్లి పథకాలు గురించి మాట్లాడిన ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకి దమ్ము, దైర్యం, చీము నెత్తురు ఉంటే.. ఎక్కడైనా తాను చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. 2014 నుంచి 19 వరకు కుప్పం, టెక్కలిలో ఎవరెవరికి ఏం ఇచ్చారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏం మేలు చేశామో ప్రజలకు చెబుదామని.. ఈ సవాల్‌ని స్వీకరించే సత్తా ఉందా? అని నిలదీశారు.