స్టార్ హీరోయిన్ నయనతారపై సివిల్ కేసు నమోదైంది. తన పర్మిషన్ లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ విజువల్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రూపొందించి ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో వాడుకోవడంతో స్టార్ హీరో ధనుష్ కేసు పెట్టారు. నయనతారతో పాటు ఆమె భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్.. ఆయన నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్‌పై కూడా మద్రాస్ హైకోర్టులో కేసు నమోదైంది. ధనుష్ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం విచారణకు అంగీకరించింది.
నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విషయంలో నయనతార, ధనుష్ మధ్య వివాదం మొదలైంది. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన ‘నానుమ్ రౌడీ దాన్’ విశేషాలను తన డాక్యుమెంటరీలో చూపించాలని నయన్ అనుకున్నారు. కానీ చిత్ర నిర్మాత ధనుష్ అందుకు ఒప్పుకోలేదు. ఎన్నిసార్లు అభ్యర్థించినా.. పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో ఇటీవల నయనతార ఓ బహిరంగ లేఖ పోస్ట్ చేశారు. ధనుష్ నుంచి పర్మిషన్ రానందుకు తాను ఎంతో బాధపడ్డానని, డాక్యుమెంటరీ ట్రైలర్‌లో మూడు సెకన్ల సీన్స్ ఉపయోగించినందుకు పరిహారంగా రూ.10 కోట్లు డిమాండ్ చేశారని చెప్పారు. ధనుష్ తనపై ద్వేషం కనబరుస్తున్నారని, మన మనసు గాయపడింది కీలక వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్‌లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. నయనతారకు పలువురు మద్దతు తెలిపారు. ఈ విషయంలోనే తాజాగా ధనుష్ నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. నయన్ దంపతులతో పాటు వారి రౌడీ పిక్చర్స్‌పై సంస్థపై దావా వేసింది.
Also Read: Allu Arjun Remuneration: షాకింగ్.. 300 కోట్లు ఏంది సామి?
‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. నయనతార కెరీర్, ఆమె ఎదుర్కొన్న అవమానాలు, విమర్శలను చూపించారు. విఘ్నేశ్ శివన్‌తో నయనతార పరిచయం, ప్రేమ, పెళ్లి ఘటనలతో రూపొందించారు. ఇక నానుమ్ రౌడీ దాన్ సినిమాకు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా నయనతార హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను ధనుష్ నిర్మించారు.