Devender Yadav: ఢిల్లీ పీసీసీ తాత్కాలిక చీఫ్‌గా దేవేందర్ యాదవ్ నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ పార్టీకి షాక్ ఇచ్చారు. తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీపై నిరాధార అవినీతి, అక్రమాల ఆరోపణలతోనే ఆప్ ఏర్పాటైనట్లు అర్విందర్ లేఖలో తెలిపారు. అలాంటి పార్టీతో పొత్తు వద్దని ఢిల్లీ శాఖ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ.. అధిష్ఠానం నిర్ణయం మేరకు కూటమిని సమర్థించినట్లు వెల్లడించారు. మరోవైపు డీపీసీసీ అధ్యక్ష హోదాలో పార్టీ పదవుల నియామకాలను చేపట్టేందుకు ఢిల్లీ ఇన్‌ఛార్జి తనను అనుమతించడం లేదని ఆరోపించారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పొత్తులో భాగంగా పార్టీకి మూడు సీట్లే కేటాయించడంపైనా అర్విందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. పార్టీ ప్రయోజనాల కోసం అంగీకరించామని చెప్పారు.
ఇది కూడా చదవండి: Dulam Nageswara Rao: కైకలూరు వైసీపీలోకి భారీగా చేరికలు.. పార్టీలోకి ఆహ్వానించిన దూలం
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
అయితే మూడు సీట్లలో ఒకదానికి తన పేరు బలంగా వినిపించినప్పటికీ.. ఇతర సీనియర్ల కోసం తాను స్వయంగా పోటీ నుంచి వైదొలగానని చెప్పారు. కానీ రెండు స్థానాల్లో అసలు ఢిల్లీ కాంగ్రెస్‌తో సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి అభ్యర్థులుగా ప్రకటించారని వాపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకుల ప్రయోజనాలను రక్షించలేని తాను పదవిలో కొనసాగడం సమంజసంగా భావించడం లేదని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Uttarpradesh : విడాకులు తీసుకున్న కూతురిని బ్యాండ్ భాజాలతో ఇంటికి తెచ్చుకున్న తండ్రి
ఇండియా కూటమిలో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌కు ఆప్ మూడు సీట్లు ఇచ్చింది. ఇక ఇతర రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్‌కు సీట్లు కేటాయించలేదు. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. ఢిల్లీలో మే 25న లోక్‌సభ పోలింగ్ జరగనుంది.

Dkee
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!