ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది. ప్లాస్టిక్ నిషేధంపై ఏపీ డీప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కోరారు. రఘురామ మాట్లాడుతూ.. ఇటీవల కేరళ ప్రభుత్వం మంచి తీసుకొచ్చింది. ఆ పాలసీతో ప్లాస్టిక్ ను నిషేధించడానికి మార్గం సుగమమైందన్నారు. ఏపీలో లిక్కర్ వినియోగం ఏ రేంజ్ లో ఉందో మన ఆదాయం చూస్తేనే తెలుస్తుందన్నారు.
లిక్కర్ బాటిల్స్ అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ కావడం వల్ల ప్లాస్టిక్ పొల్యూషన్ మరింత పెరిగిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో ఓ జిల్లాలో లిక్కర్ బాటిల్ మీద అదనంగా రూ. 10 వసూలు చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారుడు ఆ ఖాళీ బాటిల్ ను తిరిగిఇచ్చిన వెంటనే అదనంగా వసూలు చేసిన రూ. 10 ని తిరిగి ఇచ్చేస్తున్నారని తెలిపారు. దీంతో ప్లాస్టిక్ రీసైకిల్ కు దారులు తెరుచుకుంటాయన్నారు.
బ్రాండీ బాటిల్స్ కి ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఏపీలో కూడా కేరళ మాదిరిగా పాలసీ తీసుకొస్తే ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేయొచ్చని అన్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటే మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ను అరికట్టొచ్చన్నారు. ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ నిషేధానికి మీలాంటి హీరోస్ తోటి అడ్వర్టైజ్‌మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు అవుతుంది. మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ ని నిషేధించండి అని మీరు జన సైనికులకు చెప్పారంటే చాలు.. ఎవరన్నా ప్లాస్టిక్ పడవేస్తే పట్టేసుకుంటారు. జనసైనికులు ఆ మధ్యన మీరు ఇచ్చిన పిలుపు మేరకు రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చారు.
Also Read:ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎడీఎస్ అనిల్ చౌహాన్!
ప్లాస్టిక్ ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఇస్తే చాలు ఇంక అది ఆగిపోతుందన్నారు. సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే.. ఈ ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని పవన్ కళ్యాణ్ ను కోరారు. తల్లి గర్భంలో లో కూడా ఈ పొల్యూటెంట్స్ మైక్రో పొల్యూటెంట్స్ భయాందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. అలాగే గ్రామాల్లో, నగరాల్లో డిజిటల్ బోర్డ్స్ ని ఎంకరేజ్ చేస్తే ఈ ఫ్లెక్సీలు మానేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో డిజిటల్ బోర్డ్స్ లోనే ఇచ్చుకుంటారన్నారు. డిజిటల్ బోర్డ్స్ ని ఎంకరేజ్ చేస్తే ప్లాస్టిక్ నిషేధించొచ్చని తెలిపారు.