కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం.. వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. రైతు భరోసా మూలంగా రాష్ట్రంలో సాగు యోగ్యమైన 1.49 కోట్ల ఎకరాలకు 69.70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 9 వేల కోట్లు వేశామని చెప్పారు. సన్నధాన్యం సాగు చేస్తున్న రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్…