సంక్రాంతి పండగ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై హైదరాబాద్ రవాణా శాఖ అధికారులు దాడులు చేశారు.9 బృందాలతో దాడులు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని శివార్లలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా, సరైన పర్మిట్లు లేకుండా, ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తూ పొరుగు రాష్ట్రాల మధ్య తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
Read Also: తెలంగాణలో కొత్తగా..1920 కరోనా కేసులు
ప్రధానంగా ప్రయివేట్ వాహనాలు స్టేజీ క్యారియర్లుగా నడపటం సరైన పత్రాలు లేని వాహనాలపై అధికారులు దాడులు చేసి కేసు నమోదు చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు నిబంధనలు అతిక్రమించకుండా మోటార్ వాహనాల చట్టాలకు లోబడి వాహనాలను నడపాలని రవాణాశాఖ అధికారలు పేర్కొన్నారు.