తెలంగాణలో కొత్తగా..1920 కరోనా కేసులు

తెలంగాణలో రోజు రోజుకు కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఈ రోజు కొత్తగా 1920 కరోనా కేసులు నమోదైనట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా మొత్తం కరోనా కేసులు 6,97,775 గా ఉన్నాయి. కరోనాతో రికవరీ అయిన వారి సంఖ్య 417గా ఉంది. మరో వైపు కోరోనాతో ఈ రోజు ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,045 గా ఉంది.

Read Also: ఏపీలో క‌రోనా విజృంభ‌ణ.. కొత్తగా 1,831 కేసులు

అయితే రికవరీ రేటు 97.05 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు కరోనాతో చికిత్స పొందుతున్న వారి సంఖ్య16,496గా ఉంది. ఈ రోజు 83,153 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 1920 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యాధికారులు వెల్లడించారు. ఇంకా 15,969 మంది పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉందని వైద్యాధికారులు పేర్కొన్నారు. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

Related Articles

Latest Articles