Sunanda Pushkar Case: సునందా పుష్కర్ హత్య కేసు.. శశిథరూర్‌కు నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunanda Pushkar Case: తన భార్య సునంద పుష్కర్ మృతి కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత శశిథరూర్‌ను డిశ్చార్జ్ చేస్తూ ట్రయల్ కోర్టు 2021లో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నగర పోలీసులు గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. థరూర్ తరపు న్యాయవాదికి తన పిటిషన్ కాపీని అందించాలని ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాదిని జస్టిస్ డీకే శర్మ కోరారు. ఆగస్టు 18, 2021న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేయడంలో జాప్యాన్ని క్షమించాలని కోరుతూ పోలీసులు చేసిన దరఖాస్తుపై థరూర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో శశిథరూర్‌కు ఊరట లభించిన దాదాపు 15 నెలల తర్వాత దిల్లీ పోలీసులు తీర్పుపై రివిజన్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఈ నోటీసులకు శశిథరూర్ స్పందించాలని కోరింది. కేసుకు సంబంధించిన కాపీలు, పత్రాలను వ్యాజ్యదారులకు మినహా మరెవ్వరికీ అందించరాదని కూడా ఆదేశించింది. హైకోర్టు ఈ అంశాన్ని 2023 ఫిబ్రవరి 7న విచారణకు లిస్ట్ చేసింది.
Single Use Plastic ban: నిషేధిత ప్లాస్టిక్ వాడితే భారీ జరిమానా.. ఉత్తర్వులు జారీ
Also Read
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
- Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
వ్యాపారవేత్త సునంద పుష్కర్ ఇక్కడి ఓ లగ్జరీ హోటల్లో శవమై కనిపించిన ఏడేళ్ల తర్వాత థరూర్ ఈ కేసు నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సునంద పుష్కర్ జనవరి 17, 2014 రాత్రి ఒక విలాసవంతమైన హోటల్లోని సూట్లో శవమై కనిపించారు. ఆ సమయంలో శశి థరూర్ అధికారిక బంగ్లాను పునర్నిర్మిస్తున్నందున ఈ జంట హోటల్లో బస చేశారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తొలుత ఇది హత్య అన్న కోణంలో విస్తృతంగా దర్యాప్తు జరిగింది. చివరకు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే, సునంద ఆత్మహత్య చేసుకునేలా శశి థరూర్ ప్రేరేపించారని ఆయనపై గతం అభియోగాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో అరెస్టు చేయలేదు. ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. దీంతో ఆయన దిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని కాంగ్రెస్ నేత తరపు న్యాయవాది వాదించారు. ఈ కేసుపై విచారణ జరిపిన పాటియాలా హౌస్ కోర్టు.. 2021 ఆగస్టులో శశిథరూర్‌పై నమోదైన అభియోగాలను కొట్టివేస్తూ ఆయనకు క్లీన్చిట్ ఇచ్చింది.
తాజావార్తలు
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..