తన భార్య సునంద పుష్కర్ మృతి కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత శశిథరూర్‌ను డిశ్చార్జ్ చేస్తూ ట్రయల్ కోర్టు 2021లో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నగర పోలీసులు గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. థరూర్ తరపు న్యాయవాదికి తన పిటిషన్ కాపీని అందించాలని ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాదిని జస్టిస్ డీకే శర్మ కోరారు.