Single Use Plastic ban: నిషేధిత ప్లాస్టిక్ వాడితే భారీ జరిమానా.. ఉత్తర్వులు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా జరిమానా విధించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్‌ను సవరించింది.. కాలుష్యాన్ని సృష్టించే వారే ఈ వ్యయాన్ని భరించాలన్న థియరీ ఆధారంగా పెనాల్టీలు వేసేందుకు నిర్ణయం ఈసుకుంది.. ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు విధించనున్నట్టు పేర్కొంది.. పాలిథీన్ క్యారీబ్యాగులు ఉత్పత్తి, విక్రయాలపైనా, ఈ కామర్సు కంపెనీల పైనా దృష్టి పెట్టాలని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్లాస్టిక్ వినియోగంపై దృష్టి పెట్టాలని ఆదేశాలు ఇచ్చింది.. నిషేధించిన ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతి, తయారీపై మొదటిసారి తప్పుగా రూ. 50 వేలు, రెండోమారు రూ. 1 లక్ష జరిమానా విధించాలని స్పష్టం చేసింది.
Read Also: G-20 Presidency: జీ-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తులు, స్టాక్ చేసినా, పంపిణీ చేసినా డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో రూ. 25-50 వేలు జరిమానాతో పాటు సీజ్ చేసిన ఉత్పత్తులపై కేజీకి 10 రూపాయల చొప్పున పెనాల్టీ విధించనున్నారు.. ఇక, వీధి వ్యాపారులు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులుల వినియోగిస్తే రూ. 2500 నుంచి రూ. 5 వేల వరకు జరిమానా పడనుంది.. దుకాణాలు, సంస్థలు, మాల్స్ లాంటి చోట సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు విక్రయిస్తే రూ. 20 వేల నుంచి రూ. 40 వేల జరిమానా వసూలు చేయనున్నారు.. అంతేకాదు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల రవాణా చేస్తే రూ. 25 వేల నుంచి రూ. 50 వేల జరిమానా పడనుంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా.. ఎస్ఈబీ, రవాణా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేస్తూ.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. అంటే నిషేధించిన ప్లాస్టిక్ వాడకుండా ఉంటే తప్ప.. ఉప్పత్తి చేసినా, రవాణా చేసినా, మార్కెట్ చేసినా, వాడినా.. ఇలా అన్ని రకాలుగా జేబుకు చిల్లు పడుతుందన్నమాట.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..