ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారు. దీంతో ఆయనపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని మోడీని అనర్హులుగా ప్రకటించడంతో పాటు ఆరేళ్ల పాటు నిషేధించాలని పిటిషన్‌లో తెలిపారు. పిలిభిత్‌లో ఎన్నికల ప్రసంగంలో ప్రధాని హిందూ దేవతలు, ప్రార్థనా స్థలాలతో పాటు సిక్కు దేవతల పేర్లతో తమ పార్టీకి ఓట్లు అడిగారని సదరు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక, దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది.
Read Also: CSK vs SRH: ముందుగా ఫీల్టింగ్ ఎంచుకోవడమే మా ఓటమికి కారణం కాదు: ప్యాట్ కమిన్స్
ఇక, ప్రధాని మోడీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఢిల్లీ హైకోర్టు న్యాయవాది ఆనంద్ ఎస్ జోంధాలే దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయనను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌కు సూచించాలి అని తెలిపారు. ఈ పిటిషన్‌లో ఏప్రిల్ 9వ తేదీన పిలిభిత్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగం గురించి తెలియజేశారు.
Read Also: Pithapuram: పిఠాపురం బరిలోకి ఊహించని వ్యక్తి..! ఇంతకీ ఆయన ఎవరు..?
అయితే, పిలిభిత్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ రామమందిరాన్ని నిర్మించినట్లు చెప్పారని పిటిషనర్ పేర్కొన్నారు. కర్తాపూర్ సాహిబ్ కారిడార్ కూడా అభివృద్ధి చేసినట్లు ప్రచారం చేశారు.. గురుద్వారాలలో వడ్డించే లంగర్‌లో ఉపయోగించిన వస్తువులకు GST నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలు రెండు కులాలు లేదా వర్గాల మధ్య ఉద్రిక్తతను సృష్టించగలవని పిటిషనర్ అన్నారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశాం.. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని లాయర్ ఆనంద్ ఎస్ జోంధాలే వెల్లడించారు.