CSK vs SRH: ముందుగా ఫీల్టింగ్ ఎంచుకోవడమే మా ఓటమికి కారణం కాదు: ప్యాట్ కమిన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pat Cummins On SRH Defeat vs CSK: టాస్ గెలిచి ముందుగా ఫీల్టింగ్ ఎంచుకోవడం తమ ఓటమికి కారణం కాదని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. తమ బ్యాటింగ్ లైనప్ బాగుందని, ఛేజింగ్ చేస్తామని భావించే ఆ నిర్ణయం తీసుకున్నామన్నాడు. మేము త్వరగా పుంజుకుంటాము అని కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. ఆదివారం రాత్రి చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 78 పరుగుల తేడాతో ఓడిపోయింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్.. 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది.
మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ… ‘ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటేనే గెలుస్తామన్నది నిజం కాదు. గెలవడానికి ఛేదన అత్యుత్తమ అవకాశం అనుకున్నాం. అందుకే టాస్ గెలిచాక బౌలింగ్ ఎంచుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోవాల్సి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 210 పరుగులు చేయడానికి వారు బాగా కష్టపడ్డారు. మా బ్యాటింగ్ లైనప్ బాగుంది కాబట్టి.. గెలిచే అవకాశం ఉందని భావించాం. కానీ అలా జరగలేదు. ఈ టోర్నమెంట్‌లో మా ప్లేయర్స్ అందరూ ఎన్నో మ్యాచ్‌లలో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి గెలిపించారు’ అన్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: RCB vs GT: ఆల్‌టైమ్ రికార్డ్.. 10 బంతుల్లోనే 50 రన్స్!
‘పిచ్ బాగుంది. మొదటి ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉంది. మాకు అదే పరిస్థితి ఎదురైంది. మా బ్యాటింగ్ లైనప్ గురించి సంతోషంగా ఉన్నాం. ఈరోజు మాత్రమే మేం గెలవలేకపోయాం. మేము త్వరగా పుంజుకుంటాము. వచ్చే మ్యాచులలో మంచి ప్రణాళికలతో బరిలోకి దిగుతాం’ అని ప్యాట్ కమిన్స్ చెప్పాడు. ఐపీఎల్ 2024లో ఎస్‌ఆర్‌హెచ్ ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడి.. ఐదింటిలో గెలిచింది. ప్రస్తుతం 10 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన ఆరు మ్యాచులలో మూడు గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి.
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!