Pahalgam Terror Attack : మా హృదయాలను పిండేస్తోంది.. పహల్గాం దాడిపై సెలబ్రిటీలు
- మనసులు కదిలించిందన్న మెగాస్టార్
- క్షమించరాదన్న ఎన్టీఆర్
- సెలబ్రిటీల పోస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఈ ఉగ్రదాడి అత్యంత క్షమించరాని క్రూరమైన చర్య అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వివరించారు.
బాధితులను చూస్తుంటే నా గుండె బరువెక్కుతోంది. ఇలాంటి దారుణాలు జరగకూడదు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
Also Read
పహల్గాంలో టెర్రరిస్టుల అటాక్ నా మనసును కదిలించేసింది. సొసైటీలో ఇలాంటి దారుణాలకు చోటు లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ రామ్ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also:Pahalgam Terror Attack: 5 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయిన నేవీ ఆఫీసర్
అల్లు అర్జున్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందమైన ప్రదేశంలో జరిగిన ఈ దారుణం నా హృదయాన్ని కదిలించింది. బాధిత కుటుంబాకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలి అంటూ కోరారు.
మూడు నెలల క్రితం షూటింగ్ కోసం పహల్గాం వెళ్లినట్టు నాని తెలిపారు. 200 మంది అక్కడ పనిచేశామన్నారు. ఇంతలోనే అక్కడ ఇలాంటి దారుణాన్ని ఊహించలేదన్నారు. అక్కడ జరిగిన దారుణం తన హృదయాన్ని కలిచివేస్తోందని తెలిపారు. ఇంత దారుణం ఎందుకు చేశారు అంటూ ప్రశ్నించారు.
ఈ దాడిని అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నానని సంజయ్ దత్ అన్నారు. దాడికి పాల్పడిన వారిని క్షమించరాదన్నారు. వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు.
ఉగ్రదాడి తనను కలిచివేసిందన్నారు అక్షయ్ కుమార్. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు చెప్పారు.
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!